‘‘చంద్రబాబుకి ఇక నో యూటర్న్..ఓన్లీ డెడ్ ఎండ్’’

By ramya NFirst Published Feb 6, 2019, 1:39 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మరోసారి విమర్శల దాడికి పాల్పడ్డాడు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మరోసారి విమర్శల దాడికి పాల్పడ్డాడు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమని పేర్కొన్నారు.

ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆ సమయంలో.. చంద్రబాబుకి ఇంక ఎన్డీయేలోకి రానివ్వమంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా మాటలకు చంద్రబాబు కూడా అదేరీతిలో సమాధానం ఇచ్చారు. కాగా.. దీనిపై కన్నాలక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

బాబు గారు,

"మీరు మీ 'సహజ U-టర్న్ లక్షణం'తో 2019 ఎన్నికలలో రాహుల్ కి 'వెన్నుపోటు' పొడిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న బీజేపీ దగ్గరకు U-టర్న్ తీసుకుని రావడానికి ఇక ఏ అవకాశం లేదని అమిత్ షా గారు దృడంగా చెప్పారు.
ఇక 2019 ఎన్నికలలో మీకు నో 'U-టర్న్'
ఓన్లీ 'డెడ్-ఎండ్'. pic.twitter.com/ZFMkdZui3y

— Kanna Lakshmi Narayana (@klnbjp)

‘‘బాబు గారు, "మీరు మీ 'సహజ U-టర్న్ లక్షణం'తో 2019 ఎన్నికలలో రాహుల్ కి 'వెన్నుపోటు' పొడిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న బీజేపీ దగ్గరకు U-టర్న్ తీసుకుని రావడానికి ఇక ఏ అవకాశం లేదని అమిత్ షా గారు దృడంగా చెప్పారు.ఇక 2019 ఎన్నికలలో మీకు నో 'U-టర్న్'ఓన్లీ 'డెడ్-ఎండ్'’’ అంటూ కన్నా ట్వీట్ చేశారు. 

ఒకరు 20లక్షల కుటుంబాలకు వ్యతిరేకంగా 'శారదా కుంభకోణం' సూత్రదారులకు రక్షణ కల్పిస్తున్నవారు..

ఇంకొకరు 5 రాష్ట్రాలలోని సుమారు 32 లక్షల మంది సొమ్ము దోచిన 'అగ్రిగోల్డ్ కంపెనీని' కంటికిరెప్పాలా కాపుకాస్తున్నవారు..

వీరిద్దరి డిమాండ్ ఏమిటో తెలుసా?
సేవ్ డెమోక్రసీ అట... https://t.co/G2DhhU0Oaq

— Kanna Lakshmi Narayana (@klnbjp)

 

అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాలను పోలుస్తూ మరో ట్వీట్ చేశారు. ‘‘ఒకరు 20లక్షల కుటుంబాలకు వ్యతిరేకంగా 'శారదా కుంభకోణం' సూత్రదారులకు రక్షణ కల్పిస్తున్నవారు..ఇంకొకరు 5 రాష్ట్రాలలోని సుమారు 32 లక్షల మంది సొమ్ము దోచిన 'అగ్రిగోల్డ్ కంపెనీని' కంటికిరెప్పాలా కాపుకాస్తున్నవారు.. వీరిద్దరి డిమాండ్ ఏమిటో తెలుసా? సేవ్ డెమోక్రసీ అట’’ అంటూ కన్నా మరో ట్వీట్ చేశారు. 

click me!