వర్షం ఎఫెక్ట్: మంత్రుల ఛాంబర్లలోకి వర్షపు నీరు

Published : Aug 20, 2018, 03:09 PM ISTUpdated : Sep 09, 2018, 01:34 PM IST
వర్షం ఎఫెక్ట్: మంత్రుల ఛాంబర్లలోకి వర్షపు నీరు

సారాంశం

ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ఎడ తెరిపి లేకుండా  కురుస్తున్న వర్షానికి  మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మంత్రుల ఛాంబర్లలో నీరు నిలిచిపోయింది.  

అమరావతి:ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ఎడ తెరిపి లేకుండా  కురుస్తున్న వర్షానికి  మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో మంత్రుల ఛాంబర్లలో నీరు నిలిచిపోయింది.

ఏపీ మంత్రులు  గంటా శ్రీనివాస రావు,. దేవినేని ఉమా మహేశ్వర్‌రావు,  అమర్నాథ్ రెడ్డి ల ఛాంబర్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 4,5వ, బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడి కింద పడింది. 

అసెంబ్లీ భవనంలో కూడ పలు చోట్ల సీలింగ్ కిందపడింది.  అసెంబ్లీ మొదటి అంతస్తులో కూడ వర్షపు నీరు వచ్చి చేరింది.  గతంలో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఛాంబర్లో  వర్షపు నీరు చేరడంతో పెద్ద ఎత్తున  ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు కురిపించాయి.

జగన్ ఛాంబర్లో వర్షపు నీరు చేరిన ఘటనపై అప్పట్లో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు కూడ జారీ చేసింది.  అయితే తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా  సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి వర్షం నీరు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు విపక్షాలకు మరోసారి ఆయుధం దొరికనట్టైంది.


ఈ వార్త చదవండి

రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్...సచివాలయానికి ముప్పు

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu