జగన్‌కు నాగబాబు కౌంటర్: వైసీపీ తప్పుల లెక్క ఇదీ

By narsimha lodeFirst Published Aug 20, 2018, 1:57 PM IST
Highlights

రాజకీయాల్లో  వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని  వైసీపీ తీసుకొన్న నిర్ణయంలో అర్థం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు  వ్యక్తిగతమైన విమర్శలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.


హైదరాబాద్:  రాజకీయాల్లో  వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని  వైసీపీ తీసుకొన్న నిర్ణయంలో అర్థం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు  వ్యక్తిగతమైన విమర్శలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.

ఓ తెలుగు  న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.  రాజకీయపరంగా, సిద్ధాంతపరంగా, విధానాల పరంగా విమర్శలు చేసుకోవడంలో తప్పులేదని నాగబాబు చెప్పారు. అయితే  ఈ విమర్శలు వ్యక్తిగతంగా ఉండకూడదన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదని ఆయన సూచించారు.

పది ఎమ్మెల్యేలు ఉంటే తాను అసెంబ్లీలో టీడీపీని ప్రజా సమస్యలపై నిలదీసేవాడినని పవన్ కళ్యాణ్ చెప్పాడని... ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. సుమారు 10 మాసాలకు పైగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉండడమంటే  ఒక రకంగా  టీడీపీకి  మంచి అవకాశం ఇచ్చినట్టేనని నాగబాబు అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో తాము అనుకొన్న అంశాలను మాత్రమే  ప్రస్తావించుకొనే అవకాశం టీడీపీకి దక్కేలా  వైసీపీ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఈ రెండు పార్టీలు వైఫల్యం చెందాయన్నారు.

డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయడమనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదన్నారు. కేజ్రీవాల్‌ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి డబ్బులు ప్రధానం కారణం కాదన్నారు.  ప్రజలతో సంబంధాలు పెంచుకొంటే  అధికారంలోకి వస్తారని కేజ్రీవాల్  నిరూపించారని  ఆయన చెప్పారు.

ప్రజలతో పవన్ కళ్యాణ్  కనెక్ట్ అవుతున్నారని ఆయన చెప్పారు.  ప్రజలతో ఎంత మేరకు సంబంధాలు పెంచుకొంటే ఆ మేరకు ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్దారు.

ఈ వార్త చదవండి

టార్గెట్ 2019: తెలంగాణలో పవన్ ప్లాన్ ఇదే

 

click me!