దేవుడి ముందు ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సై: అనపర్తిలో టెన్షన్ వాతావరణం

By narsimha lode  |  First Published Dec 23, 2020, 10:42 AM IST

తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. 


కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. 

ఇద్దరు నేతల మధ్య  పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకొన్నారు.ఈ విషయమై వినాయకుడి ఆలయంలో  ప్రమాణం చేసేందుకు సిద్దమని ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో 144 సెక్షన్ నెలకొంది.

Latest Videos

undefined

అనపర్తి   నుండి ఎమ్మెల్యేగా సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై బిక్కవోలు గణేషుడి విగ్రహం వద్ద ప్రమాణం చేసేందుకు తాను సిద్దమని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రకటించారు. మరో వైపు తాను కూడ ఈ విషయమై తాను కూడ సిద్దమని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

బుధవారం నాడు మధ్యాహ్నం గణేషుడి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రమాణం చేస్తానని ఆయన తెలిపారు. అదే సమయంలో దేవాలయంలో తాను కూడ భార్యతో కలిసి ప్రమాణం చేస్తానని ఆయన ప్రకటించారు.

దేవుడి ముందు ప్రమాణం చేయడంతో పాటు నియోజకవర్గంలో  ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి చేసిన అవినీతిని రుజువు చేస్తానని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  నియోజకవర్గంలో రూ. 500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. 18 నెలలుగా తాను ఆధారాలతో బయటపెడుతున్నానని చెప్పారు.ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్దమని చెబితే  నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించడాన్ని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి ఆరోపణల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. గణేషుడి ఆలయంలో ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే దంపతులతో పాటు ఐదుగురికి మాత్రమే పోలీసులు అనుమతించారు.

ఒకేసారి ఇద్దరు ప్రమాణం చేయడాన్ని పోలీసులు అనుమతించలేదు. వేర్వేరు సమయాల్లో ఇద్దరు నేతలు ప్రమాణానికి పోలీసులు అనుమతించారు. 

గుడికి వెళ్లే సమయంలో తనకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.


 

click me!