
రాజీనామా చేసే ముందు ఆంధ్రకు చేసిన అన్యాయానికి నిరసనగా "మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు" అని తీర్మానం పెట్టాలని రాజమండ్రి మాజీ ఎంపి, ప్రత్యేక హోదా క్యాంపెయినర్ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపి నేత జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
హోదా విషయాన్ని తేల్చేందుకు కేంద్రానికి జగన్ మూడేళ్లు నిండేదాకా,అంటే జూన్ దాకా గడువిచ్చారు. అప్పటికదాకా ఏమీ జరగకపోతే, జూన్ లో తమ పార్టీ ఎంపిలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళతారని జగన్ ప్రకటించిని విషయం తెలిసిందే.
ఇది చేసే ముందు మోదీ చేత ప్రత్యేక హోదా గురించి వివరణ ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
“మూడేళ్లు నిండిన తర్వాత ఎలాగూ రాజీనామా చేస్తారన్నారు కాబట్టి ఆ రాజీనామా ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఆపై రాజీనామా చేస్తే బావుంటుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసిసి పెట్టబోయే అవిశ్వాస తీర్మానం పెడితేచాలా పార్టీలు మద్దతు నిస్తాయని చెబుతూ కచ్చితంగా కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ వస్తాయని అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ కాంగ్రెస్ఎంపి గా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు ఆయన దూరమయ్యారు. ప్రస్తుతానినికి ఏ పార్టీలో లేరు. ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న నాయకుల్లో ఆయన ఒకరు.
ఏమో... తెలుగుదేశం పార్టీ కూడా కలసి వచ్చే అవకాశం లేకపోలేదని కూడా ఆయన అన్నారు.
ఎవరైనా ఒక ఎంపి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని, కాకపోతే, దానికి 50 మంది ఎంపీలు మద్దతు ఉండాలని అయన చెప్పారు.తీర్మానం ఒక వేళ వీగిపోయినా అవిశ్వాసం తీర్మానానికి ప్రధాని సమాధానం చెప్పాల్సిఉంటుందని అన్నారు.
‘ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదనే సింగిల్ పాయింట్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే చాలు. దాని మీద చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలకు వివరంగా మాట్లాడే హక్కు ఉంటుంది. అవిశ్వాసం వీగిపోతే వాకౌట్ చేసి రావచ్చు. వచ్చే ముందు రాజీనామా చేయవచ్చు. ఇది జగన్ కు నా విజ్ఞప్తి,’ అని అరుణ్ కుమార్ అన్నారు.