వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కి చిక్కులు: తెరపైకి భార్య పేరు

Published : Mar 20, 2019, 10:42 AM ISTUpdated : Mar 20, 2019, 10:45 AM IST
వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కి చిక్కులు: తెరపైకి భార్య పేరు

సారాంశం

హిందూపురం  వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

హిందూపురం  వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు వీఆర్ఎస్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఆయన ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి ఇంకా అనుమతి లభించలేదు.

2018 సెప్టెంబర్ లో తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల్లో అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న, సీఐ గోరంట్ల మాధవ్ కి, జేసీ కి మధ్య వివాదం రాజుకుంది. ఆక్రమంలో ఆయన తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి వైసీపీలో చేరారు. 

తాజాగా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాధవ్ కు  హిందూపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు. ఆయన రాజీనామా చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు  మాధవ్ రాజీనామాకు డిపార్ట్మెంట్ పరంగా ఆమోదం లభించలేదు.  దీంతో ఆయన ప్రభుత్వ తీరుపై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. 

ఈ విషయం తేలకపోతే.. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ విషయం తేలకపోతే... కనీసం ఆయన భార్యని అయినా రంగంలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు