శారీరకంగా వాడుకుని వదిలేసిన వాలంటీర్... మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

Published : Sep 05, 2023, 02:43 PM IST
శారీరకంగా వాడుకుని వదిలేసిన వాలంటీర్... మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

సారాంశం

ప్రేమన్నాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... శాారీరకంగా వాడుకుని వదిలేసాడు.... ఇలా వాలంటీర్ చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల మిస్సింగ్ కు జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఓ కారణమంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒంటరి మహిళలు, ఆర్థిక కష్టాల్లో వున్న యువతులు, వితంతువుల వివరాలను వాలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు అందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు వాలంటీర్ల తీరు ఈ ఆరోపణలు నిజమే అన్న అనుమానాలు కలిగిస్తోంది. ఇలా ఎన్టీఆర్ జిల్లాలో ఓ వాలంటీర్ అమ్మాయిని ప్రేమపేరుతో నమ్మించి మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

బాధిత యువతి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో పిల్లి సతీష్ వాలంటీర్ గా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా నిత్యం గ్రామంలోనే వుండే ఇతడు అదే గ్రామానికి చెందిన యువతి ఇష్టపడ్డాడు. ప్రేమిస్తున్నానని వెంట పడటంతో యువతి కూడా అంగీకరించింది. ఇలా కొన్నాళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో శారీరకంగా దగ్గరయ్యాడు. ఇలా పలుమార్లు ప్రేమికులిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. 

అయితే ఇటీవల ప్రియుడు సతీష్ ను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయసాగింది. కానీ ఆమెను పెళ్ళాడటం ఇష్టంలేని అతడు ముఖం చాటేయసాగాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. ప్రేమించినవాడికి దూరంగా వుండలేక చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి కుటుంబసభ్యులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాధిత యువతి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

వీడియో

యువతి ఆత్మహత్యాయత్నానికి కారణం తెలుసుకున్న కుటుంబసభ్యులు వాలంటీర్ సతీష్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న నందిగామ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ ఆడబిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu