
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకి సీఎంగా ఇదే చివరి జనవరి 1 అని జోస్యం చెప్పారు. 2014లో ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ ఏడాది వెనక్కు తీసుకోబోతున్నారని ట్వీట్ చేశారు. త్వరలో తన మనవడితో చంద్రబాబు ఆడుకోవచ్చని ట్వీట్ చేశారు.
ఇంతకంటే చంద్రబాబు తెలుగు ప్రజలకు ఇవ్వగలిగింది ఏముంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు దివంగత నేత హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించారంటూ ఫోటోతో సహా మరో ట్వీట్ చేశారు. మాదక ద్రవ్యాలను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.