విజయనగరం: చేతబడి పేరుతో చంపారు, మరో వ్యక్తిని అక్కడే చంపి కాల్చేశారు

By narsimha lodeFirst Published Jul 23, 2020, 1:11 PM IST
Highlights

విజయనగరం జిల్లా ఏజెన్సీలో మూఢనమ్మకానికి ఓ గిరిజనుడిని అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్నడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


విజయనగరం: విజయనగరం జిల్లా ఏజెన్సీలో మూఢనమ్మకానికి ఓ గిరిజనుడిని అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్నడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని నెల్లికెక్కువ పంచాయితీ పరిధిలోని గ్రామానికి చెందిన 23 ఏళ్ల పల్లెరిక ప్రసాద్ అనారోగ్యంతో ఈ నెల 11వ తేదీన మరణించాడు. అదే రోజుల అతని అంత్యక్రియలు నిర్వహించారు. 

చిల్లంగి ( చేతబడి) చేయడంతోనే ప్రసాద్ మరణించాడని కుటుంబసభ్యులు అనుమానించారు. చేతబడి చేయడంలో మిన్నారావు అలియాస్ బారికి పై ప్రసాద్ ఫ్యామిలీ అనుమానం వ్యక్తం చేసింది. 

also read:వివాహేతర సంబంధం: భార్యను చంపి తలను వేరు చేశాడు...

మిన్నారావును చంపాలని భావించారు. ప్రసాద్ డెడ్ బాడీ దగ్దమైందో లేదో చూద్దామని  మిన్నారావును స్మశానం వద్దకు తీసుకెళ్లారు. అక్కడే అతడిని రాళ్లతో కొట్టి కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాద్ అంత్యక్రియలు జరిగిన చోటే నిప్పు పెట్టి ఖననం చేసి ఇంటికొచ్చారు. మిన్నారావు కోసం కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.

  మిన్నారావు బంధువును ప్రసాద్ బంధువులు ఈ నెల 21వ తేదీన పిలిపించారు.  అయితే ఈవిషయాన్ని వివాదం చేయొద్దని కోరారు. ఇందుకు నిరాకరించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విషయమై అనుమానితులైన 17 మందిపై కేసు నమోదు చేశారు. 

click me!