రాజమండ్రిలో మరో ఆనందయ్య: కరోనాకు వసంత కుమార్ మందు

By telugu team  |  First Published May 22, 2021, 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆనందయ్య ముందుకు వచ్చారు. ఆనందయ్య లాగానే గత కొద్ది రోజులుగా వసంత కుమార్ ప్రజలకు కరోనాకు ఆయుర్వేద మందును అందిస్తున్నారు. అయితే, ఆయన తాజాగా పంపిణీని ఆపేశారు.


రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి రూరల్ మండలం రాజోలులో కూడా కరోనాకు ఓ ఆయుర్వేద వైద్యుడు మందును ఇస్తున్నారు. అయితే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య మందు పంపిణీని ఆపేసిన ప్రభావం ఆయనపై కూడా పడింది. కరోనాకు మందు ఇవ్వడాన్ని వసంత కుమార్ ఆపేశారు.

వసంత కుమార్ వద్ద కూడా పెద్ద యెత్తున ప్రజలు క్యూ కట్టారు. అయితే, ప్రభుత్వం అనుమతిస్తేనే తాను మందు ఇస్తానని ఆయన చెబుతున్నారు. మందు పంపిణీని ఆపేశాడు. తాను గత 30 ఏళ్లుగా ఆయుర్వేదం మందులు తయారు చేసి ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు 

Latest Videos

undefined

రాజమండ్రి ప్రాంతంలో బ్రిటిష్ కాలం నుంచి ఇళ్లలో ఆయుర్వేదం మందులను తయారు చేసే సంప్రదాయం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అది కుటుంబాల్లో వారసత్వంగా సంక్రమించే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగానే వసంత కుమార్ గత కొద్ది రోజులుగా కరోనాకు మందు ఇస్తున్నారు. 

ఆనందయ్య మందును పరిశీలించడానికి ఐసిఎంఆర్ బృందం, ఆయూష్ సిబ్బంది పూనుకున్నారు. ఆయన ఐసిఎంఆర్ బృందం సమక్షంలో మందును తయారు చేయనున్నారు. అయితే, వసంత కుమార్ ఇచ్చే మందు ఆనందయ్య పంపిణీ చేస్తునటు వంటి మందేనా, వేరేదా అనేది తెలియడం లేదు. 

అయితే, వసంత కుమార్ ఆయుర్వేద పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. వసంత కుమార్ బంధువులకు, సన్నిహితులకు మందు ఇచ్చారు. అది  ఆ నోటా ఈ నోటా ప్రచారంలోకి రావడంతో ప్రజలు ఆయన వద్దకు వచ్చారు. ఆయన ఇంటి వద్ద ఆయన క్యూ కట్టారు. రాజోలులోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆయన జబ్బులకు మందు ఇస్తుంటారు.

click me!