విశాఖ శ్రావణి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. మరొకరితో సన్నిహితంగా వుంటోందని, ప్రియుడే

Siva Kodati |  
Published : May 20, 2023, 06:42 PM IST
విశాఖ శ్రావణి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. మరొకరితో సన్నిహితంగా వుంటోందని, ప్రియుడే

సారాంశం

విశాఖ వివాహిత శ్రావణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మరో వ్యక్తితో చనువుగా వుంటోందనే అక్కసుతో ఆమెను ప్రియుడు గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ వివాహిత శ్రావణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మరో వ్యక్తితో చనువుగా వుంటోందనే అక్కసుతో ఆమెను ప్రియుడు గోపాల్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రావణికి ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో శ్రావణికి గోపాల్‌తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేశారు.

ALso Read: విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

ఈ క్రమంలో శ్రావణి.. గోపాల్ మిత్రుడైన వెంకీతోనూ సన్నిహితంగా మెలుగుతోంది. దీనిపై గతకొంతకాలంగా గోపాల్- శ్రావణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున కూడా గొడవ జరగ్గా.. ఆవేశంలో శ్రావణి గొంతునులిమి చంపేశాడు గోపాల్. అనంతరం గాజువాక పోలీసులకు లొంగిపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu