వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ .. సర్వం సిద్ధం, చిత్ర యూనిట్‌కి షాకిచ్చిన విశాఖ పోలీసులు

By Siva KodatiFirst Published Jan 7, 2023, 6:10 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి విశాఖ పోలీసులు షాకిచ్చారు. ఆర్కే బీచ్‌లో వేడుక జరుపుకోవడానికి వీల్లేదని, ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని పోలీసులు తేల్చిచెప్పారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి విశాఖ పోలీసులు షాకిచ్చారు. ఓ పక్క ఈవెంట్ కోసం వేదిక నిర్మాణం జరుపుతుండగా ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి లేదని తేల్చిచెప్పారు విశాఖ సీపీ. ఈ కార్యక్రమాన్ని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లోనే నిర్వహించాలని సీపీ చెప్పారు. వేదికకు సంబంధించి ఇప్పటికే ఆర్కే బీచ్‌లో సగం పనులు పూర్తి కావడంతో ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిపోయారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వింటేజ్ లుక్ లో అలరించబోతున్నాడు. యంగ్ అండ్ మాస్ లుక్ లో తెరపై దుమ్ములేపబోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, శంకర్ నిర్మిస్తుండగా దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ చిరు సరసన నటిస్తోంది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వారంలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు.

click me!