విశాఖలో గ్యాస్ లీకేజీ: ఎల్జీ పాలీమర్స్‌పై కేసు నమోదు

By narsimha lodeFirst Published May 7, 2020, 5:48 PM IST
Highlights

విశాఖపట్టణం  ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీపై  గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో గురువారంనాడు కేసు నమోదైంది.
 

విశాఖపట్టణం: విశాఖపట్టణం  ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీపై  గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో గురువారంనాడు కేసు నమోదైంది.

ఇవాళ ఉదయం ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి స్టెర్లిన్ గ్యాస్ లీకైంది. దీంతో 10 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.  ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.

గ్యాస్ లీకేజీని అరికట్టడంలో వైఫల్యం చెందినందున పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 278,284,285, 337,338,304 సెక్షన్ల కింద గోపాలపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:సీఎం జగన్ ను కలిసిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులు: ప్రమాదంపై వివరణ

నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పరిస్థితిని అదుపు చేయలేకపోవడం, విషవాయువుతో గాలిని కలుషితం చేయడం, మావన జీవనానికి హాని కల్గించడం వంటి సెక్షన్ల కింద  పోలీసులు కేసులు పెట్టారు.

ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పర్యావరణ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ జిల్లా ఎస్పీ, విశాఖ సీపీలతో కమిటిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటి ప్రమాదంపై విచారణ చేయనుంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనుంది.

click me!