అనకాపల్లి గవరపాలేనికి చెందిన భీశెట్టి లోకనాథం ఆత్మహత్య ఓ పెద్ద యూట్యూబ్ గ్రూపును రట్టు చేసింది. మారణాయుధాల అమ్మకం, పారిశ్రామిక వేత్తలను డబ్బుకోసం బెదిరించే గ్యాంగ్ ను పట్టుకున్నామని విశాఖ జిల్లా అనకాపల్లి సీఐ లంక భాస్కరరావు తెలిపారు.
అనకాపల్లి గవరపాలేనికి చెందిన భీశెట్టి లోకనాథం ఆత్మహత్య ఓ పెద్ద యూట్యూబ్ గ్రూపును రట్టు చేసింది. మారణాయుధాల అమ్మకం, పారిశ్రామిక వేత్తలను డబ్బుకోసం బెదిరించే గ్యాంగ్ ను పట్టుకున్నామని విశాఖ జిల్లా అనకాపల్లి సీఐ లంక భాస్కరరావు తెలిపారు.
గత నెల 27న భీశెట్టి లోకనాథం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత కుటుంబసభ్యులు ఇల్లు క్లీన్ చేస్తుంటే రెండు పిస్టళ్లు, 18 బుల్లెట్లు దొరికాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతుడు లోకనాథం సెల్‌ఫోన్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు.
undefined
అలా గాజువాక న్యూపోర్టు ప్రాంతానికి చెందిన గంగాధర్ (రాజుబాయ్)ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం లోకనాథానికి తమ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చాయి. దీంతో లోకనాథం తన మామను చంపాలని నిర్ణయించుకున్నాడు.
భార్యబిడ్డలను వదిలి ఒంటరిగా ఉంటూ.. మామ హత్యకు పథకాలు వేయడం మొదలెట్టాడు. గతంలో లోకనాథం దేశ, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడంతో అనేక పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మారణాయుధాల అక్రమ వ్యాపారం చేస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బు వసూలు చేసే నలుగురు సభ్యులున్న ఆజాద్ మాంగేర్ గ్రూపుతో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలోనే విశాఖలో ఉండే ఒక ప్రైవేటు కంపెనీని రూ.5 లక్షలు ఇవ్వాలని లోకనాథం డిమాండ్ చేశాడు. అంతేకాకుండా పాత ఇనుప సామాన్ల దుకాణం యాజమాన్యాన్ని రూ. 6 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు.
అయితే..ఇటీవల లోకనాథం అనారోగ్యానికి గురికావడం, భార్య, కుమార్తెలు దూరంగా ఉండడంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఉరేసుకుని చనిపోయాడు. ఇదే సమయంలో లోకనాథం గ్రూపులోకి రాకపోవడంతో గ్రూపు సభ్యులైన హరియాణా రాష్ట్రం మోహిత్ ఎరియాన్‌కు చెందిన బంటీజూట్, ఉత్తరాఖండ్ దినేష్‌పూర్‌కు చెందిన సామ్రాట్ దాలి, ఢిల్లీకి చెందిన అభిషేక్ భరద్వాజ్ లోకనాథం విషయమై గంగాధర్‌ను సంప్రదించారు.
అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఒక పిస్టల్, 4 బుల్లెట్లు, 6 సెల్‌ఫోన్లు స్వాదీన పరుచుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచి్చన సామ్రాట్ దాలి, బంటీజాట్, అభిషేక్ భరద్వాజ్‌ను అరెస్టు చేసి మంగళవారం స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.