విశాఖ మైనర్ బాలికపై రెండు నెలలుగా లైంగికదాడి... ఆ రాత్రి కూడా యువకుడితోనే..: పోలీస్ విచారణలో సంచలనాలు

Arun Kumar P   | Asianet News
Published : Oct 07, 2021, 09:43 AM ISTUpdated : Oct 07, 2021, 09:53 AM IST
విశాఖ మైనర్ బాలికపై రెండు నెలలుగా లైంగికదాడి... ఆ రాత్రి కూడా యువకుడితోనే..: పోలీస్ విచారణలో సంచలనాలు

సారాంశం

విశాఖపట్నం మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసుపై విచారణ జరిపిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా బాలికపై లైంగిక దాడి జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

విశాఖపట్నం: విశాఖ నగరంలో అనుమానాస్పద రీతిలో ఓ మైనర్ బాలిక మృతిచెందిన విషయం తెలిసిందే. ఓ అపార్ట్ మెంట్ పై నుండి పడి బాలిక ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో విచారణ జరిపిన పోలీసులకు అసలు నిజాలు తెలిసాయి. బాలిక మృతికి గల కారణాలను ఏసిపి శిరీష వెల్లడించారు.

దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఎసిపి శీరీషా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి బాలిక కీర్తన మృతి గురించి వివరించారు. బాలికను గత రెండు నెలలుగా దిగుమతి నరేష్ అనే యువకుడు శారీరకంగా అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత బాలిక నరేష్ ను కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఇదే సమయంలో నిద్రలేచిన తండ్రి సత్యం కూతురు కనిపించపోవడంతో వెతకడం ప్రారంభించాడు.  

వీడియో

కుటుంబసభ్యులు తనను వెతుకుతుండటంతో భయపడిపోయిన బాలిక టెరస్ పైకి వెళ్లింది. అక్కడి నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని ఏసిపి శిరిష వెల్లడించారు. మ్తెనర్ బాలికను లోబర్చుకుని  అత్యాచారం చేసినందుకు నరేష్ పై 174 సిఆర్ పిసి, 376 ipc,సెక్షన్ 6 పొక్సో యాక్ట్ నమోదుచేసినట్టు ఎసిపి శీరీష తెలిపారు. 

read more  అపార్ట్ మెంట్ మీదినుంచి దూకి.. ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి !

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేటకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖకు వలస వచ్చింది. నగరంలోని కూర్మన్నపాలెం శనివాడలోని ఆదిత్య అపార్ట్ మెంట్ లో సత్యం వాచ్ మెన్ గా చేరడంతో కుటుంబంతో సహా అక్కడే నివాసముంటున్నాడు. 

అయితే అతడి కుమార్తె పదమూడేళ్ల కీర్తన మంగళవారం రాత్రి నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతికారు. చివరకు బుధవారం తెల్లవారుజామున పక్క అపార్ట్ మెంట్ లో ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్ మెంట్ పై నుండి కిందపడి చనిపోయినట్లు తెలుస్తున్న ఆ అపార్ట్ మెంట్ లోని బాలిక ఎందుకు వెళ్లింది తెలియరాలేదు. దీంతో ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు బాలికపై రెండు నెలలుగా జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటపడింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్