Vinukonda assembly elections result 2024: వినుకొండ : పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత వినుకొండలో గెలిచిన గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులును ఓడించి ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు బొల్లా. ఇలా ఇద్దరు బలమైన నేతల మధ్య ఎన్నికల యుద్దం జరుగుతుండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.
Vinukonda assembly elections result 2024: వినుకొండ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఎక్కువగా వుండేది. దీంతో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలకు మధ్యే పోటీ వుండేది. ఇలా 1952 నుండి ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలకే వినుకొండలో ప్రాతినిధ్యం వుండేది. అయితే 1994 స్వతంత్ర అభ్యర్థిగా గెలియిన వీరపనేని యల్లమందరావు 1999 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత జివి ఆంజనేయులు రాకతో టిడిపి మరింత బలోపేతం అయ్యింది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జివి 2019 ఎన్నికల్లో మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో ఓడిపోయారు.
వినుకొండ అసెంబ్లీ పరిధిలోని మండలాలు :
వినుకొండ
ఐపూరు
నూజెండ్ల
శావల్యపురం
బొల్లాపల్లె
వినుకొండ నియోజకవర్గ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) :
నియోజకవర్గంలో నమోదయిన మొత్తం ఓటర్లు - 2,51,659
పురుషులు 125932
మహిళలు 125897
వినుకొండ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వినుకొండ వైసిపి అభ్యర్థి :
బొల్లా బ్రహ్మానాయుడికే మళ్లీ వైసిపి టికెట్ దక్కేలా వుంది.
వినుకొండ టిడిపి అభ్యర్థి :
వినుకొండ బరిలో జివి ఆంజనేయులును నిలిపింది టిడిపి
వినుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
వినుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన గోనుగుంట్ల వెంకట శివ సీతా రామ ఆంజనేయులు 30,267 ఓట్ల తేడాతో YSRCP అభ్యర్థి బోళ్ల బ్రహ్మ నాయుడుని ఓడించారు.
వినుకొండ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నమోదైన ఓటర్లు 2,51,847
పోలైన ఓట్లు 2,23,859
వైసిపి - బొల్లా బ్రహ్మనాయుడు - 1,20,703 (54 శాతం) - 28,628 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - జివి ఆంజనేయులు - 92,075 (41 శాతం) - ఓటమి
వినుకొండ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు 2,30,210
పోలైన ఓట్లు 1,97,689
టిడిపి - జివి ఆంజనేయులు - 1,04,321 (52 శాతం) - 21,407 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - నన్నపనేని సుధ - 82,914 (41 శాతం) - ఓటమి