పెళ్లికి వెళ్లి వస్తున్న బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

Published : Oct 24, 2019, 02:59 PM IST
పెళ్లికి వెళ్లి వస్తున్న బాలకృష్ణను  అడ్డుకున్న గ్రామస్థులు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకోసం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. హిందూపురం నియోజకవర్గం వెళ్తున్న ఆయనను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాలకృష్ణ హిందూపురం వస్దున్నారన్న విషయం తెలుసుకొని లేపాక్షి-హిందూపురం ప్రధాన రహదారిపై విద్యార్థులు, గ్రామస్థులు బైఠాయించారు.

లేపాక్షి- హిందూపురం   మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు.
 
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకోసం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లిన బాలకృష్ణ, అక్కడి నుంచి రోడ్డు మార్గాన హిందూపురం చేరుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారును ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.
 
బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన బాలకృష్ణ వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు కొడికొండ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మాజీ ఎంపీపీ నాజియా భాను, రాష్ట్ర చంద్రదండు ఉపాధ్యక్షుడు అన్సార్ అహ్మద్, చిలమత్తూరు మండల మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు.

PREV
click me!

Recommended Stories

Roja Selvamani Fires On Kirrak RP | Kirrak RP Mahanadu Speech | Asianet News Telugu
Varudu Kalyani Comments: మహానాడు కాదు.. దగానాడు.. వరుదు కల్యాణి కామెంట్స్| Asianet News Telugu