పవన్ కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్థులు

By telugu teamFirst Published Jun 6, 2019, 3:53 PM IST
Highlights

ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడకు వచ్చారు. ఈ ఎన్నికల్లో పరాజయం అనంతరం... పవన్.. తమ పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. 

ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడకు వచ్చారు. ఈ ఎన్నికల్లో పరాజయం అనంతరం... పవన్.. తమ పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఓటమిపై సమీక్షించి... తరువాతి కార్యచరణపై దృష్టి పెడుతున్నారు.

ఇక నుంచి ప్రతి నిమిషం ప్రజలతోనే ఉండి.. వారి సమస్యలు తెలుసుకోవాలని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ధృఢంగా మార్చాలని పవన్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన పవన్... అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు.

కాగా మార్గమధ్యలో ఆయన కాన్వాయిని కృష్ణాజిల్లా కేసరపల్లి గ్రామంలో సూరంపల్లి గ్రామస్థులు, యువకులు అడ్డుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. డంపింగ్ యార్డ్‌తో కష్టాలుపడుతున్నామని.. తమ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని పవన్‌ను కోరారు. జనసేనానికి వినతి పత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని పవన్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. 

click me!