వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి...

Published : Jul 01, 2020, 09:27 AM IST
వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి...

సారాంశం

తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలని ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది.

వైద్యం చేస్తానని నమ్మించి ఓ వైద్యుడు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కాగా.. ఆ వైద్యుడిని స్థానికులు చితకబాదారు. ఈ సంఘటన ఏలూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నవాబ్‌పేట మారుతీనగర్‌ ప్రాంతంలో క్లినిక్‌ను పి. సత్యానందం నిర్వహిస్తున్నాడు. అతను ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఓ కంటి వైద్యశాలలో పారామెడికల్‌ వైద్యునిగా పనిచేస్తున్నాడు. స్థానికంగానూ ఓ క్లినిక్‌‌ను నిర్వహిస్తున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తలనొప్పితో బాధపడుతూ క్లినిక్‌కు వచ్చింది.  సత్యానందం ఆ యువతికి ఒక ఇంజెక్షన్‌ చేశాడు. తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలని ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది.

 బయట ఉన్న యువతి సోదరుడు లోనికి వెళ్లి అడ్డుకున్నాడు. బంధువులకు సమాచారమివ్వడంతో వారంతా క్లినిక్‌ వద్దకు చేరుకుని వైద్యునికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సై రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu