విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 12, 2024, 4:44 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో వైసిపి ఒంటరిగా పోటీచేస్తుంటే... తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. బిజెపితో కలిసి ఎన్నికలకు వెళుతున్న టిడిపి, జనసేనకు కూటమికి మైనారిటీ వర్గాల సపోర్ట్ వుంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరీముఖ్యంగా ముస్లిం ఓటర్లే గెలుపోటములను నిర్ణయించే విజయవాడ పశ్చిమ వంటి నియోజకవర్గాల్లో పొత్తుల ప్రభావం ఎలా వుండనుందోననే చర్చ ఎక్కువగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలవేళ రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

విజయవాడ పశ్చిమ రాజకీయాలు :

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో బిజెపి, ప్రజారాజ్యం పార్టీల నుండి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసారు. అయితే బిజెపి తరపున పోటీచేసినప్పుడు తప్పితే మిగతా రెండుసార్లు విజయం సాధించాడు. దీన్నిబట్టే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎలావుంటుందో అర్థమవుతుంది.  

ఇక గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ (2014, 2019) విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపిదే విజయం. అయితే 2014 లో వైసిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జలీల్ ఖాన్ ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. 2019 లో జలీల్ ఖాన్ కూతురు షబాన ముసరత్ ఖాతూన్ టిడిపి తరపున పోటీచేసినా వెల్లంపల్లి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న లాంటివారు టిడిపి టికెట్ ఆశిస్తున్నా పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కే అవకాశాలున్నాయి. 


విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1.  విజయవాడ అర్బన్ మండలం (విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 13, 15 నుండి 19, 75,76 వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి) 

 
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,32,604

పురుషులు -  1,15,750
మహిళలు ‌-   1,16,823

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు మరోసారి వైసిపి అవకాశం ఇవ్వలేదు. ఆయనను విజయవాడ సెంట్రల్ కు మార్చారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముస్లింల ప్రభావం ఎక్కువగా వుండే విజయవాడ పశ్చిమ అసెంబ్లీలో మైనారిటీ నేత షేక్ ఆసిఫ్ ను బరిలోకి దింపింది వైసిపి.

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి : 

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకు దక్కేలా వుంది. జనసేన నేత పోతిన మహేష్ ఈ సీటును ఆశిస్తున్నారు. ఇక టిడిపి నుండి కూడా మైనారిటీ నేత జలీల్ ఖాన్ మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. 
 

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓటు ‌- 1,53,623 (63 శాతం)

వైసిపి - వెల్లంపల్లి శ్రీనివాస్ - 58,435 (38 శాతం) - 7,671 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - షబానా ముసరత్ ఖాతూమ్ - 50,764 (33 శాతం) -  ఓటమి 

జనసేన పార్టీ - పోతిన వెంకట మహేష్ ‌- 22,367 (14 శాతం) 
 

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,54,459 (65 శాతం)

 వైసిపి  - జలీల్ ఖాన్ - 63,180 (40 శాతం) - 3,108 ఓట్ల తేడాతో విజయం

బిజెపి - వెల్లంపల్లి శ్రీనివాస్  - 60,072 (38 శాతం) - ఓటమి

click me!