ఎవరయ్యా చిన్ని .. ఎంపీనా, ఎమ్మెల్యేనా .. చంద్రబాబు కోసమే భరిస్తున్నా : సోదరుడిపై కేశినేని నాని ఫైర్

Siva Kodati |  
Published : Jan 03, 2024, 09:42 PM ISTUpdated : Jan 03, 2024, 09:50 PM IST
ఎవరయ్యా చిన్ని ..  ఎంపీనా, ఎమ్మెల్యేనా .. చంద్రబాబు కోసమే భరిస్తున్నా :  సోదరుడిపై కేశినేని నాని ఫైర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని బ్రదర్స్ కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి తాను బరిలో దిగుతానని అంటుండగా.. ఆయన సోదరుడు కేశినేని చిన్ని తనకు అధిష్టానం అండదండలు వున్నాయని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని బ్రదర్స్ కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి తాను బరిలో దిగుతానని అంటుండగా.. ఆయన సోదరుడు కేశినేని చిన్ని తనకు అధిష్టానం అండదండలు వున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తిరువూరులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. 

ఈ నెల 7న చంద్రబాబు సభ వున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయం చేసేందుకు గాను కేశినేని నాని, చిన్నిలు తిరువూరు వెళ్లారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నాని లేకపోవడంతో ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. కుర్చీలు విరగ్గొట్టి, ఫ్లెక్సీలు చించడంతో పాటు తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ దత్తుపైనా అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న చిన్ని .. టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయనను నాని వర్గీయులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 

ఈ ఘటనపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పార్టీలో చిన్ని ఎవరు..? ఎంపీనా, ఎమ్మెల్యేనా అంటూ ఫైర్ అయ్యారు . ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా వుంటున్నానని, యువగళం పాదయాత్రలోనూ అందుకే పాల్గొనలేదని నాని చెప్పారు. చంద్రబాబును పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారని.. కానీ తాను ఓపికగా వుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు కోసం, టీడీపీ అధికారంలోకి రావడం కోసమే ఎన్నో అవమానాలు భరిస్తున్నానని కేశినేని నాని పేర్కొన్నారు. 

విజయవాడలో ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో తనను చెప్పుతో కొడతానని ప్రెస్‌మీట్‌లో చెప్పాడని, పొలిట్ బ్యూరో సభ్యుడు ఒకరు గొట్టంగాడు అని వ్యాఖ్యానించారని నాని గుర్తుచేశారు. టీడీపీకి దక్కాల్సిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను అమ్ముడుపోయి చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఏడాదిగా కుంపటి రగులుతోందని, ఈ వ్యవహారానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని కేశినేని పేర్కొన్నారు. తిరువూరు ఇన్‌ఛార్జీ శ్యామ్ దత్ రాజకీయాలకు పనికిరాడని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. తిరువూరు సభ సక్సెస్ చేసే బాధ్యత తనదేనని, తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం