చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. ఆపరేషన్ గరుడలో భాగమే: బుద్దా

Published : Sep 14, 2018, 10:26 AM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. ఆపరేషన్ గరుడలో భాగమే: బుద్దా

సారాంశం

బీజేపీ, వైసీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి, ఎన్నో కేసుల్లో చిక్కుకుని.. ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్‌కు కేసుల నుంచి బయటపడటానికి బీజేపీ తన వంతు సహకారాన్ని అందిస్తోందని ఆరోపించారు

బీజేపీ, వైసీపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి, ఎన్నో కేసుల్లో చిక్కుకుని.. ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతున్న జగన్‌కు కేసుల నుంచి బయటపడటానికి బీజేపీ తన వంతు సహకారాన్ని అందిస్తోందని ఆరోపించారు..

ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు వచ్చాయన్నారు. జగన్ కేసుల విచారణ పూర్తి కాకుండా చూస్తున్న బీజేపీ.. తమ అధినేతపై పాత కేసులు తిరగదోడి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందన్నారు. తప్పెవరిదో న్యాయస్థానాలే తేలుస్తాయని అన్నారు.

ఎనిమిది సంవత్సరాలుగా మరుగున పడివున్న కేసును.. కావాలని ఎన్నికల వేళ బయటకు తీసి వారెంట్లు జారీ చేయడం ఏంటని బుద్దా ప్రశ్నించారు. ఏళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును తేల్చకుండా.. చంద్రబాబుపై బీజేపీ పగ తీర్చుకుంటోందని ఆరోపించారు. ప్రధానిలోని నియంత బయటపడ్డాడని బుద్ధా విమర్శించారు.
 

PREV
click me!

Recommended Stories

AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...
Kotamreddy Sridhar Reddy Serious Warning to YS Jagan | Punganur Incident | TDP Vs YCP