ఐదు రాష్ట్రాల్లో గాలింపు, ఆరుగురి అరెస్ట్ ... లోన్ యాప్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు

Siva Kodati |  
Published : Oct 27, 2022, 04:35 PM IST
ఐదు రాష్ట్రాల్లో గాలింపు, ఆరుగురి అరెస్ట్ ... లోన్ యాప్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ మణికంఠ కేసును ఛేదించారు విజయవాడ పోలీసులు. పలు రాష్ట్రాల్లో గాలించి లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 

విజయవాడ లోన్ యాప్ కేసును ఛేదించారు పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 13న లోన్ యాప్స్ వేధింపులతో ఆటోడ్రైవర్ మణికంఠ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ముంబై, కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌కు వెళ్లి విచారణ జరిపారు. మొత్తం 130 ఖాతాల్లోని రూ..8 కోట్లను ఫ్రీజ్ చేశామని డీసీపీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులు థర్డ్ పార్టీల ద్వారా బినామీ ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితులు సోహైల్, లతీఫ్‌లు ముంబైలో చైన్ లింక్ ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారని డీసీపీ చెప్పారు. లోన్ యాప్స్‌ను ఎవరూ నమ్మొద్దని.. డబ్బులు అవసరమైతే జాతీయ బ్యాంకులు, రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని విశాగ్ గున్నీ కోరారు. లోన్ యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగించాలంటూ గూగుల్‌కు లెటర్ రాసినట్లు డీసీపీ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Vegetables Price : దిగజారిన టమాటా, స్థిరంగా ఉల్లి... ఈ వీకెండ్ కూరగాయల రేట్లు ఇవే