ఆ బాక్స్ లో ఏముంది: పోలీసులకు చుక్కలు చూపారు

By narsimha lodeFirst Published Jan 21, 2019, 4:35 PM IST
Highlights

విజయవాడలో ఓ అనుమానాస్పద బాక్స్‌ను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బాక్స్‌లో ఇరిడీయం ఉన్నట్టుగా  అనుమానిస్తున్నారు.
 

అమరావతి:  విజయవాడలో ఓ అనుమానాస్పద బాక్స్‌ను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బాక్స్‌లో ఇరిడీయం ఉన్నట్టుగా  అనుమానిస్తున్నారు.

ప్రపంచంలో దొరికే ఖనిజాల్లో ఇరీడియం లేదా యురేనియంగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ బాక్స్‌లో అత్యంత రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నట్టుగా  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నై నుండి ఈ బాక్స్ ను  తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ బాక్స్‌లో  ఏముందో  అనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు. మరోవైపు   ఈ బాక్స్  డీఆర్‌డీఓకు చెందినదిగా  రాశారు.  ఈ బాక్స్‌పై డీఆర్‌డీఓ అని ఎందుకు రాశారనే విషయమై కూడ పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరిద్దరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతున్నారని సమాచారం. యురేనియం ఉందని ఒకరు, ఇరిడీయం ఉందని మరోకరు సమాధానం ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

ఇరిడీయం అత్యంత విలువైంది.  బంగారం కంటే సుమారు 30 రెట్లు ఇరిడీయం విలువగా  నిపుణులు చెబుతున్నారు.  అసలు ఈ బాక్స్‌లో ఏముందనే విషయాలను  పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం జన సంచారం లేని ప్రాతంలో పోలీసులు ఈ బాక్స్ ను ఓపెన్ చేశారు. ఈ బాక్స్‌ను ఓపెన్ చేసిన తర్వాత  రాగిబిందె, వైర్లు, అయస్కాంతం, వైర్లు ఉన్నట్టు గుర్తించారు.బాక్స్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. అయితే ఈ బాక్స్ లో  యురేనియం లేదా ఇరిడీయం వంటి ఉన్నాయని నిందితులు చెబుతున్నారని సమాచారం.

రైస్ పుల్లింగ్ కు పాల్పడేవారే ఈ తరహా రాగి బిందె ను ఉపయోగిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ బాక్స్ ను తరలిస్తున్న వారిలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

click me!