విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో పురోగతి: నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lode  |  First Published Aug 2, 2023, 2:43 PM IST

విజయవాడ కిడ్నీ రాకెట్ లో  నలుగురిని  పోలీసులు ఇవాళ అరెస్ట్  చేశారు. కిడ్నీని విక్రయించుకున్న తర్వాత లక్ష్మి అనే మహిళ బ్రోకర్ అవతారం ఎత్తిన విషయాన్ని  పోలీసులు గుర్తించారు.


విజయవాడ:కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడు  కార్తీక్ ను  బుధవారంనాడు పోలీసులు అరెస్ట్  చేశారు.కిడ్నీ మార్పిడిలో  రూ. 29 లక్షలకు  కార్తీక్ డీల్ సెట్ చేసుకున్నారు.కిడ్నీ డోనర్ కు  రూ. ఏడున్నర లక్షలు, ఇతరులకు  రూ. 21.50 లక్షలు ఇచ్చాడు.కిడ్నీని దీపక్ కు ఇచ్చేందుకు  కార్తీక్  ఒప్పందం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. కార్తీక్ సహా మరో ముగ్గురిని పోలీసులు ఇవాళ అరెస్ట్  చేశారు.  

విజయవాడ బాలభాస్కర్ నగర్ కు చెందిన  చిన్న అనే మహిళ  తూర్పు గోదావరి జిల్లాకు  చెందిన  నల్లమిల్లి దీపక్ రెడ్డిని తన పెద్దనాన్న కొడుకుగా చూపి  కిడ్నీ దానానికి అనుమతి కోరుతూ  ధరఖాస్తు  చేసుకున్నారు. ఈ పత్రాలు నకిలీవిగా తేలడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్. 

Latest Videos

undefined

గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్ బీ కిడ్నీ దానం కోసం  అనుమతివ్వాలని  ఈ ఏడాది జూలై  24న  విజయవాడ పశ్చిమ తహసీల్దార్ కు  ధరఖాస్తు  చేసుకున్నారు.  రామవరప్పాడులో నివాసం ఉండే  సత్యవతికి  కిడ్నీ దానం చేసేందుకు  ధరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు  ఆధార్ కార్డులో పేరును కూడ మార్చుకున్నట్టుగా  తమ దర్యాప్తులో వెల్లడైందని  తహసీల్దార్  చెప్పారు. ఈ విషయమై  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. కిడ్నీ రాకెట్ పై  పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ రెండు  ఘటనల్లో కార్తీక్  కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసుల్లో కార్తీక్ తో పాటు లక్ష్మి,నాగమణి, వెంకయ్యలను  పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ వ్యవహరంలో కీలక సూత్రధారి బాబూరావు  పరారీలో ఉన్నాడు. గతంలో బాబురావు వద్దే కార్తీక్ పనిచేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. 

ఇదిలా ఉంటే  పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో లక్ష్మి  గతంలో తన కిడ్నీని విక్రయించినట్టుగా  పోలీసుల విచారణలో తేలింది.  కిడ్నీ విక్రయించిన తర్వాత  లక్ష్మి కిడ్నీ బ్రోకర్ గా మారిందని పోలీసులు చెబుతున్నారు.

 


 

click me!