విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావును సస్పెండ్ చేశారు అధికారులు. గత వారంలో రాఘవరావు నివాసంలో ఏసీబీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే.
విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టైన విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. గత వారంలో విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాఘవరావు నివాసంలో భారీగా ఆస్తులను గుర్తించారు. రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ సూపరింటెండ్ నగేష్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగేష్ ఇంట్లో కూడా భారీగా ఆస్తులను గుర్తించారు. మరో వైపు ఉమ్మడి కర్నూల్ జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్ నివాసంలో కూడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆధాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంగా ఈ ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
undefined
also read:ఏపీలో కొనసాగుతున్న సోదాలు: దుర్గగుడి సూపరింటెండ్, పటమట సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంగా విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ వారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.