Vijayawada: ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందని అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నప్పటికీ అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడుతోందని తెలిపారు.
Andhra Pradesh MP V Vijayasai Reddy: రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నప్పటికీ అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఎంపీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీ, ఫార్మాస్యూటికల్ హబ్ హైదరాబాద్ లో తలసరి ఆదాయం రూ.2,65,623 ఉండగా, పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2,07,771గా ఉందని పేర్కొన్నారు. టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులు విదేశాల్లో స్థిరపడడం వల్ల తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ ఏపీ ముందుకు సాగుతోందన్నారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,50,007 ఉండగా, రాష్ట్ర విభజన సమస్యలను అధిగమించి అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించడంలో ఏపీ ముందుకెళ్తోందన్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం కర్ణాటక, హైదరాబాద్ మధ్య ఆర్థికాభివృద్ధిపై పోటీ ఉందనీ, అయితే ఆంధ్రప్రదేశ్ సహా మరో మూడు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆర్థిక వృద్ధిలో ముందడుగు వేస్తున్నాయని చెప్పారు.
undefined
రైతుల గురించి ప్రస్తావిస్తూ..
"భారతదేశం ఒక వ్యవసాయ దేశం. దేశంలోని రైతులను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అతి తక్కువ లేదా ఎక్కువ వర్షాలు, అకాల వర్షాలు, పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడం, సకాలంలో కొనుగోలుదారులు రాకపోవడం వంటి కారణాలతో రైతును సమస్యలు చుట్టుముడుతున్నాయని" విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ స్టార్టప్ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, తృణధాన్యాలు, పండ్లు, పూల పెంపకం, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, క్షేత్ర భూసారం, విత్తన పరిశోధనలపై పనిచేసే స్టార్టప్ లను సృష్టించాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
भारत कृषि प्रधान देश है। हर भारतवासी को देश के किसानों पर गर्व है। लेकिन देश के कई हिस्सों में किसान परेशान हैं। प्राकृतिक आपदाएँ, बहुत कम या बहुत ज्यादा बारिश, बेमौसम बारिश, उत्पाद का वाजिब मूल्य न मिलना, समय पर खरीदार न मिलना जैसे कारणों से किसान समस्याओं से घिर जाता है। 1/2 pic.twitter.com/SkQ4nCLB1N
— Vijayasai Reddy V (@VSReddy_MP)