కరోనా నిబంధనలు మరింత కఠినం...విజయవాడలో యాచకులపై నిషేధం

By Arun Kumar PFirst Published Apr 11, 2020, 8:44 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విజయవాడలో యాచకులు, నిరాశ్రయులు విధుల్లో తిరగకుండా నిషేధం విదిస్తున్నట్లు వీఎంసీ అధికారులు వెల్లడించారు. 

విజయవాడ: రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కరోనా వైరస్ విజృంభిస్తూనే వుండటంతో విజయవాడ మున్సిపల్ అధికారులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. కరోనా వ్యాప్తిచెందే అవకాశాలు వుండటంతో రోడ్లపైకి నిరాశ్రయులు, యాచకులు రాకుండా నిషేదం విధించారు. వారికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

కరోనా వ్యాప్తి దృష్ట్యా యాచకులు, నిరాశ్రయులపై విఎంసి అధికారులు, పోలీసులు ఫొకస్ పెట్టారు. బెజవాడలో యాచకులు, నిరాశ్రయుల కోసం రోడ్లపై  జల్లెడ పడుతున్నారు. 
ఐదు బస్సుల ద్వారా 250  మందికి పైగా యాచకులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షెల్టర్లకు తరలిస్తున్నారు పోలీసులు, విఎంసి అధికారులు. బస్సులు దూకి పారిపోతున్న యాచకులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు.  

యాచకులు, నిరాశ్రయులకు స్వచ్చంద సంస్ధలు రోడ్లపైకి వస్తూ ఆహారం పంపిణీ చేస్తుండడంపై కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో బెజవాడ రోడ్లపై యాచకులను నిషేదించినట్లు విఎమ్‌సి అధికారులు వెల్లడించారు. విజయవాడ పరిధిలోనే ప్రత్యేకంగా పది షెల్టర్లను ఏర్పాటుచేసి యాచకులు, నిరాశ్రయుల ఆశ్రయం కల్పిస్తున్నట్లు....వారికి అక్కడే భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

నగరంలో యాచకులు కనబడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్న విఎమ్‌సి అధికారులు తెలిపారు. ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు వీఎంసీ అధికారులు తెలిపారు. వ్యాప్తి నేపథ్యంలో విజయవాడలో యాచకులు, నిరాశ్రయులు విధుల్లో తిరగకుండా నిషేధం విదిస్తున్నట్లు వీఎంసీ అధికారులు వెల్లడించారు. 

click me!