Vijayawada Mayor: 'ప్ర‌తి షోకి వంద టికెట్లివ్వండి..' మూవీ థియేటర్ ఓన‌ర్ల‌కు విజయవాడ మేయర్ లేఖ‌..!

Published : Mar 11, 2022, 05:42 AM ISTUpdated : Mar 11, 2022, 05:52 AM IST
Vijayawada Mayor: 'ప్ర‌తి  షోకి వంద టికెట్లివ్వండి..' మూవీ థియేటర్ ఓన‌ర్ల‌కు విజయవాడ మేయర్ లేఖ‌..!

సారాంశం

Vijayawada Mayor: విజ‌యవాడ న‌గ‌ర ప‌రిధిలో కొత్త‌గా విడుద‌ల‌య్యే ప్ర‌తి సినిమాకు తమకు వంద టికెట్లు ఇవ్వాలంటూ సినిమా థియేటర్ల యాజమానులకు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి రాసింది. మొదటి రోజు మొదటి షోకు వంద టికెట్లు ఇవ్వాలన‌డంతో  థియేటర్ యజమానులు అవాక్కయ్యారు. ప్ర‌స్తుతం ఆ లేఖ వైరల్ నెటింట్లో వైర‌ల్ అవుతోంది.   

 

Vijayawada Mayor: అధికారాన్నిఅడ్డుపెట్టుకుని.. కొందరు తమ తమ స్థాయిలో ఫైరవీలు చేయడం చూస్తూనే ఉంటాం. పోలిటిక‌ల్ లీడ‌ర్స్ .. పార్టీ ఎన్నికల్లో టికెట్ కోసం..  వ్యాపారవేత్తలు కాంట్రాక్టుల కోసం .. ఉద్యోగస్థులు త‌మ ప్ర‌మోష‌న్ల‌ కోసం.. ఇలా త‌మ త‌మ అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ఫైరవీలు చేస్తూ ఉంటారు. కానీ.. తాజాగా.. ప్ర‌భుత్వప‌రంగా ఉన్న‌త స్థాయిలో ఉన్న వ్య‌క్తి  కేవ‌లం సినిమా టిక్కెట్ల‌కు కోసం ఫైర‌వీ చాలా విడ్డురంగా ఉంది. విడుదలయ్యే ప్ర‌తి పెద్ద సినిమాలకు మొదటి రోజు మొదటి షోకు వంద టికెట్లు ఇవ్వాలని కోరారు. ఈ లేఖ చూసిన థియేటర్ యజమానులు అవాక్కయ్యారు. సినిమా టిక్కెట్ల‌కు కోసం ఫైర‌వేంటీ?  నెట్టింట్లో ఆ ఫైర‌వీ లెట‌ర్ వైర‌ల్ అవ‌డమేంట‌ని.. ఇంత‌కీ ఆ లేఖ ఎవరో? అని తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా?  

వివరాల్లోకెళితే.. విజ‌య‌వాడ మేయ‌ర్ భాగ్య‌ల‌క్షి .. ఆమె థియేటర్ ఓన‌ర్లుకు ఓ రిక్వెస్ట్ చేసింది. న‌గ‌రంలో కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ థియేటర్ ఓన‌ర్ల‌ను కోరారు.  అది కూడా త‌న వ్య‌క్తిగ‌తంగా కాకుండా..  అధికారికంగా లేఖ కూడా రాసి పంపారు. ఈ లేఖను  విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు పంపించారు. 

ఇంత‌కీ ఆ లెట‌ర్ లో ఏం రాసిందంటంటే... ‘‘విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విడుద‌లయ్యే ప్ర‌తి కొత్త సినిమాల‌కు టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందువల్ల కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి 100 టికెట్లు ఇవ్వండి. ఆ టికెట్లకు డబ్బు కూడా చెల్లించడం జరుగుతుంది. తదుపరి విడుదల కానున్న సినిమాల నుంచి వీటిని ఏర్పాటు చేయండి.’’ అని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి సినిమా థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. నగరంలోని అన్ని మల్లీప్లెక్స్‌ల థియేటర్ల యాజమానులకు ఈ లేఖ వెళ్లడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu