దుర్గగుడి రథంలో మూడు సింహాల ప్రతిమలు అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు

By narsimha lode  |  First Published Sep 17, 2020, 1:37 PM IST

: విజయవాడ ఇంద్రీకీలాద్రి కనకదుర్గ అమ్మవారి వెండి రథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్టుగా ఆలయ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆలయ అధికారులు పోలీసులకు గురువారం నాడు ఫిర్యాదు చేశారు.


విజయవాడ: విజయవాడ ఇంద్రీకీలాద్రి కనకదుర్గ అమ్మవారి వెండి రథంపై ఉన్న మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురైనట్టుగా ఆలయ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆలయ అధికారులు పోలీసులకు గురువారం నాడు ఫిర్యాదు చేశారు.దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు కన్పించకుండా పోవడంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చోటు చేసుకొంది. 

also read:విజయవాడ దుర్గగుడి సింహాల ప్రతిమల మాయం: ఇంజనీరింగ్ శాఖ అధికారుల తప్పిదమేనా

Latest Videos

undefined

గత ఏడాది ఉగాది తర్వాత రథం తీయలేదని ఆలయ అధికారులు ప్రకటించారు.  దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు అదృశ్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ రీజినల్ కమిషనర్ మూర్తిని విచారణ అధికారిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఈ నెల 16వ తేదీన ఆదేశాలు జారీ చేశారు.

సింహాల ప్రతిమల కోసం ఈ నెల 16 వతేదీతో పాటు ఇవాళ ఉదయం నుండి అధికారులు విచారణ చేశారు. కానీ ఎలాంటి సమాచారం లభ్యం కాకపోవడంతో ఈ ప్రతిమలు చోరీకి గురయ్యాయని అధికారులు భావిస్తున్నారు.  చోరీకి గురైన సింహాల ప్రతిమల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని అంచనా.

మూడు సింహాల ప్రతిమలు చోరీకి గురయ్యాయని దుర్గగుడి ఈవో సురేష్ బాబు బెజవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. 

ప్రభుత్వం తీరును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నాడు రథాన్ని పరిశీలించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడ ఈ విషయమై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

click me!