దివ్య కేసు: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

By Siva KodatiFirst Published Nov 7, 2020, 3:40 PM IST
Highlights

విజయవాడలో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు.

విజయవాడలో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

అనంతరం న్యాయమూర్తి నాగేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత నిందితుడికి ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తనకు వున్న గాయాల గురించి అతను వైద్యులకు చెప్పాడు. అనంతరం నాగేంద్రను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.

అక్కడ కోవిడ్ టెస్టు నిర్వహించిన అనంతరం అతనిని రాజమండ్రి సబ్‌జైలుకు తరలించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

Also Read:దివ్య తేజస్వి హత్యకేసు..ప్రేమోన్మాది నాగేంద్రబాబు అరెస్ట్‌

సులు అదుపులోకి తీసుకున్నారు. 23 రోజుల క్రితం దివ్య తేజస్వినీని ఇంటికి వెళ్లి మరీ హత్య చేశాడు నాగేంద్ర. తమ కూతురిని పొట్టనబెట్టుకున్న నాగేంద్రను ఉరి తీయాలని దివ్య తల్లిదండ్రులు కోరుతున్నారు.

తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం వుందంటున్నారు దివ్య పేరెంట్స్. నాగేంద్రను ఉరితీయకుంటే తాము సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

దివ్యను హత్య చేసిన తర్వాత నాగేంద్ర.. తనకు తాను గాయపరుచుకుని ఆత్మహత్య డ్రామా ఆడాడు. ఈ క్రమంలో 23 రోజుల పాటు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స తీసుకున్న తర్వాత నిన్న అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు హత్యకు గల అసలు కారణాలు దిశా టీం రాబడుతోంది.  నాగేంద్ర వెల్లడించిన ఆరుగురు స్నేహితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. హత్య కేసులో పోలీసులు ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలను సేకరించారు.  
 

click me!