వంగవీటి రాధా హత్యకు రెక్కీ.. మాకు ఏ ఆధారాలు దొరకలేదు : విజయవాడ సీపీ క్రాంతి రాణా

By Siva KodatiFirst Published Jan 2, 2022, 8:45 PM IST
Highlights

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై విచారణ జరిపామన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా. రాధాపై రెక్కీ జరిగినట్లు ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్లను కేటాయించామని సీపీ వెల్లడించారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారని క్రాంతి రాణా మండిపడ్డారు. 

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై విచారణ జరిపామన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాధాపై రెక్కీ జరిగినట్లు ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్లను కేటాయించామని సీపీ వెల్లడించారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారని క్రాంతి రాణా మండిపడ్డారు. రెక్కీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని క్రాంతి రాణా అన్నారు. 

అంతకుముందు శుక్రవారం నాడు విజయవాడలోని తన కార్యాలయంలో Vijayawada CP క్రాంతి రాణా మీడియాతో మాట్లాడారు.  ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతిభద్రతలకు ఇబ్బంది కల్గిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని సీపీ హెచ్చరించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రెక్కీ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని క్రాంతి రాణా అన్నారు. Vangaveeti Radha ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారనే విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని విజయవాడ సీపీ స్పష్టం చేశారు.  రెండు నెలల సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని Kranti Rana TaTa   వివరించారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తేల్చి చెప్పారు.

Also Read:హత్యకు రెక్కీ.. వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు, అండగా వుంటామని హామీ

కాగా.. ఈ నెల 26న గుడివాడలో నిర్వహించిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో తన హత్యకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.  దీంతో వంగవీటి రాధాకు రాష్ట్ర ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే ఈ గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. ఇదే సమయంలో వంగవీటి రాధా ఇంటి సమీపంలోనే  అనుమానాస్పద స్థితిలో ఉన్న స్కూటీని ఆయన అనుచరులు గుర్తించి... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మరోవైపు శనివారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా రెక్కీ చేశారన్న అంశంపై రాధా, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా అండగా ఉంటుందని... కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని ఆయన భరోసా కల్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాధాపై హత్యాయత్నానికి సంబంధించి ఆధారాలున్నా చర్యల్లేవన్నారు. హత్యకు రెక్కీ చేసిన మాట వాస్తవమా?కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రెక్కీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా? లేదా? అని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. 

click me!