అన్నా క్యాంటీన్ల మూసివేత.. ఎన్ హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు

By telugu teamFirst Published Aug 9, 2019, 11:24 AM IST
Highlights

గత టీడీపీ ప్రభుత్వం.. పేదల ఆకలి తీర్చేందుకు  అతి తక్కువ ధర కే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి భోజనం అందించిన సంగతి తెలిసిందే. కాగా... వాటిని ఇటీవల వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అంతేకాకుండా తక్కువ ధరకు భోజనం దొరకక చాలా మంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారు.
 
ఆాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను మూసివేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి నూతలపాటి రవికాంత్ ఫిర్యాదును బుధవారం ఎన్ హెచ్ ఆర్సీకి పంపారు.

గత టీడీపీ ప్రభుత్వం.. పేదల ఆకలి తీర్చేందుకు  అతి తక్కువ ధర కే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి భోజనం అందించిన సంగతి తెలిసిందే. కాగా... వాటిని ఇటీవల వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీంతో చాలా మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అంతేకాకుండా తక్కువ ధరకు భోజనం దొరకక చాలా మంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. వీటిని జులై 31వ తేదీ నుంచి వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు 2లక్షల మంది పేదలు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు మానవ హక్కుల కమిషన్ ని కోరారు. 

click me!