రఘురామకృష్ణరాజును టీవీ చర్చలకు అనుమతించకండి.. సంసద్ సీఈవోకు విజయసాయి రెడ్డి లేఖ

By Sumanth Kanukula  |  First Published Jun 29, 2022, 10:27 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, ఆ పార్టీ రెబ్ ఎంపీ రఘురామకృష్ణరాజుల మధ్య చాలాకాలంగా వాగ్వాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రఘురామకృష్ణరాజు‌ను చర్చలకు అనుమతించవద్దని కోరుతూ Sansad TV సీఈవో‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, ఆ పార్టీ రెబ్ ఎంపీ రఘురామకృష్ణరాజుల మధ్య చాలాకాలంగా వాగ్వాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రఘురామకృష్ణరాజు‌ను చర్చలకు అనుమతించవద్దని కోరుతూ Sansad TV సీఈవో‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై  అనర్హత పిటిషన్‌పై పెండింగ్‌లో ఉన్నందున.. ఆయన తమ పార్టీ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరని విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా రఘురామకృష్ణరాజు సంసద్‌ టీవీలో ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తాను గమనించానని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

‘‘ఈ నేపథ్యంలో.. రఘురామకృష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలకు ఏ విధంగానూ ప్రాతినిధ్యం వహించరని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అందువల్ల ఆయన అభిప్రాయాలు విశ్వసనీయత లేనివి, పక్షపాతంతో కూడుకున్నవి’’ అని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అందువలం్ల ఆయన రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కాలంలో, ఆ తర్వాత ప్రస్తుత లోక్ పదవీకాలానికి విజయసాయిరెడ్డిని సంసద్ టీవీ చర్చల్లోకి అనుమతించవద్దని కోరారు. 

Latest Videos

చాలాకాలంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనే అభియోగంపై గత ఏడాది మే నెలలో ఏపీ సీఐడీ రఘురామకృష్ణరాజును అరెస్టె చేసింది. ఈ పరిణామా నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే తర్వాత రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదలయ్యారు. 

ఇక, విజయసాయిరెడ్డి లేఖపై రఘురామకృష్ణరాజు స్పందించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేని ఆయన చెప్పారు. “నన్ను ఇంటర్వ్యూలకు పిలవవద్దని విజయసాయిరెడ్డి సంసద్ టీవీకి లేఖ రాశారు. అలా చేసే అధికారం వారికి లేదు. నన్ను పార్టీ నుంచి బహిష్కరించనంత కాలం వారు అలాంటి లేఖలు రాయలేరు. కావాలంటే నన్ను బహిష్కరించనివ్వండి. నేను వివిధ చట్టపరమైన ఎంపికలను కూడా ఆలోచిస్తున్నాను’’ అని రఘురామకృష్ణరాజు చెప్పారు. 

click me!