వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి

By Siva KodatiFirst Published Jun 5, 2019, 7:47 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటేడ్‌తో వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా వైసీపీ పార్లమెంటరీ నేతగా తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని నియమించారు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటేడ్‌తో వివిధ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా వైసీపీ పార్లమెంటరీ నేతగా తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని నియమించారు.

అలాగే లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్‌రెడ్డి, పార్లమెంట్ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌ను జగన్ నియమించారు. వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి.

పెద్ద ఎత్తున లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న జగన్.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు సమర్థుడిగా జగన్.. విజయసాయిని భావించారు. 

click me!