కరోనా పై జగన్ ప్రభుత్వ పోరాటం అద్భుతం..: వెంకయ్య నాయుడు ప్రశంసలు

By Arun Kumar P  |  First Published Apr 18, 2020, 9:10 PM IST

కరోనా వైరస్ విజృంభణ వేళ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా  పనిచేస్తోందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. 


అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకై పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి జగన్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందంటూ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికన ఏపి ప్రభుత్వ చర్యలను ప్రస్తావించారు ఉప రాష్ట్రపతి. 

''కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహం. వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం'' అని వెంకయ్య నాయుడు అన్నారు.  
 
''ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుంది'' అంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ఉపయోగకరమో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వివరించారు.

Latest Videos

click me!