కుమార్తెకు వేధింపులు: యువకుడిని చంపిన తండ్రి

Published : Jun 27, 2021, 10:51 AM IST
కుమార్తెకు వేధింపులు: యువకుడిని చంపిన తండ్రి

సారాంశం

కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.

అద్దంకి:  కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ నారాయణస్వామి మీడియాకు వివరాలు అందించారు.  జిల్లాలోని సంతనూతలపాడు గ్రామానికి చెందిన తన్నీరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె.

వెంకటేశ్వర్లు కూతురు పేర్నమిట్ట వద్ద ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు ఈ అమ్మాయిని వేధింపులకు గురిచేసేవాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకొంటానని ఆ అమ్మాయిని వేధించేవాడు. మద్యం తాగొచ్చి యువతి ఇంటికి వచ్చి కూడ పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. 

ఈ విషయమై గణేష్ ను ఎంత మందలించినా కూడ అతడు తన ప్రవర్తనను మార్చుకోలేదు. దీంతో గణేష్ ను హత్య చేయాలని వెంకటేశ్వర్లు నిర్ణయించుకొన్నాడు. ఈ మేరకు తన బంధువు అంకమ్మరావు సహాయం తీసుకొన్నాడు. బంధువుల ఇంటికి వెళ్దామని గణేష్ ను  వెంకటేశ్వర్లు బైక్ పై తీసుకెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న  అద్దంకి మండలం తిమ్మాయిపాలెం పార్వతీపురం రహదారిలోకి  తీసుకెళ్లారు. కొటికలపూడి సమీపంలోని ఓ పొలం వద్ద ముగ్గురు మద్యం తాగారు. 

మద్యం మత్తులో ఉన్న గణేష్ ను వెంకటేశ్వర్లు, అంకమ్మరావులు గొంతు నులిమి చంపారు. గణేష్ దుస్తులు తొలగించి మృతదేహాన్ని నీటి కుంటలో వేశారు.  బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో వెంకటేశ్వర్లు కీలక నిందితుడని తేలిందని  డీఎస్పీ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu
వేస్ట్ వస్తువులివ్వండి నిత్యావసర వస్తువులిస్తా: CM Chandrababu Super Speech | Asianet News Telugu