కాల్‌మనీ: తాడేపల్లి పీఎస్ ముందు వెంకట్ ఆత్మహత్యాయత్నం

By narsimha lodeFirst Published Dec 15, 2019, 2:04 PM IST
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీస్ స్టేషన్ ముందు వెంకట్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 


అమరావతి:  కాల్ మనీ వ్యాపారుల ఆగడాలు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ముందు వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది.

గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన వెంకటేష్ అనే యువకుడు వడ్డీ వ్యాపారుల నుండి రూ. 6 లక్షలు అప్పుగా తీసుకొన్నాడు.ఇప్పటివరకు రూ. 23 లక్షలను తాను వడ్డీ వ్యాపారులకు చెల్లించినట్టుగా బాధితుడు తెలిపాడు.

ఈ విషయమై తాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని బాధితుడు మీడియాకు వివరించారు. పోలీసులు పట్టించుకోకుండా కాలయాపన చేసి తనను దుర్భాషలాడారని చెప్పారు.  

తొలుత మూడు రూపాయాల వడ్డీ వసూలు చేస్తామని చెప్పి ఆ తర్వాత నెలకు 12 రూపాయాలు వసూలు చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నట్టుగా బాధితుడు వెంకట్ తెలిపారు. 

డబ్బులు ఇవ్వకపోతే నీ అంతు చూస్తామంటూ తనపై నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నాడని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశాడు.

click me!