వంగవీటి రాధాను దూరం పెట్టిన జగన్

By ramya neerukondaFirst Published Jan 8, 2019, 3:38 PM IST
Highlights

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత వంగవీటి రాధా కి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని.. రాధా త్వరలో పార్టీ మారనున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత వంగవీటి రాధా కి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని.. రాధా త్వరలో పార్టీ మారనున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేసేలా తాజాగా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... జగన్ గతేడాది చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర.. రేపటితో‘(జనవరిరి9) ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా...  ఈ ముగింపును వేడుకగా చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురంలో ఈ యాత్ర ముగియనుంది. కాగా.. ఈ ముగింపు వేడుకల్లో పార్టీ కీలకనేతలంతా తలమునకలై తిరుగుతుంటే.. విజయవాడకు చెందిన పార్టీ కీలక నేత వంగవీటి రాధా మాత్రం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్ని విభేదాల కారణంగానే రాధా ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాధా కూడా స్పందించారు. పాదయాత్ర ముగింపు సభకు కేవలం సమన్వయకర్తలను మాత్రమే ఆహ్వానించారని.. తనకు జగన్ వద్ద నుంచి ఆహ్వానం అందలేదని.. అందుకే తాను దూరంగా ఉన్నట్లు రాధా తెలిపారు. విజయవాడ సెంట్రల్ సీటు రాధకి దక్కలేదు కాబట్టి.. అసలు వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేసే అవకాశమే లేదని కొందరు చర్చించుకుంటున్నారు.

పార్టీ మారితే తప్ప.. ఆయనకు సీటు దక్కదనేది మరికొందరి వాదన. పార్టీ మారే విషయంపై మాత్రం ఇటు రాధా కానీ.. అటు జగన్ కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. 

click me!