ఆడబిడ్డ మానప్రాణాలు కాపాడలేని వాడు సింహమా?: సీఎం జగన్ పై టిడిపి అనిత ఫైర్

By Arun Kumar PFirst Published May 13, 2022, 2:34 PM IST
Highlights

ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోోహన్ రెడ్డిపై టిడిపి మహిళా నేతల వంగలపూడి అనిత, ప్రతిభా భారతి మండిపడ్డారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ  స్పీకర్ ప్రతిభా భారతి ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం... ఇక ముఖ్యమంత్రి అయితే అసలే స్పందించకపోవడం దారుణమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నివాసం పక్కనే మహిళపై అఘాయిత్యం జరిగితే పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. 

 తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... రాష్ట్రాన్ని జగన్ నేరాలు ఘోరాలకు అడ్డాగా మార్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రాష్ట్రం బీహార్, యూపీలను మించిపోయేలా కనిపిస్తోంది. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి నిన్నటివరకు రాష్ట్రంలో 60 అఘాయిత్యాలు జరిగాయి. చోడవరంలో 7 సంవత్సరాల ఆడబిడ్డపై  అఘాయిత్యానికి పాల్పడ్డవారిని కూర్చోబెట్టి మంత్రులే  సెటిల్ మెంట్లు చేయడం దుర్మార్గం'' అని అనిత మండిపడ్డారు. 

''పక్క రాష్ట్రం తెలంగాణలో యువతిపై అత్యాచారం జరిగిందని దిశాచట్టం తెచ్చిన మొనగాడు, తనజిల్లాలో 15ఏళ్ల ఆడబిడ్డ గర్భందాల్చితే ఏంచేస్తున్నాడు? తనను గెలిపించిన సొంతరాష్ట్రం ఆడబిడ్డలపై జగన్ రెడ్డికి ఎందుకింత వివక్ష?'' అని నిలదీసారు. 

''పోలీస్ వ్యవస్థ, మహిళా కమిషన్ నిర్వీర్యమవడంవల్లే ఆడబిడ్డలకు ఈ దుస్థితి. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మని కలిసి ఊరికోఉన్మాది ఉన్నాడని ఒక పుస్తకమే ఇచ్చాము. కానీ ఆమెనుంచి మాకు పిలుపే రాలేదు. హోంమంత్రి కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రోజుకి 2, 3ఘటనలు జరుగుతున్నాయి.  ఊరికో ఉన్మాది పుస్తకానికి కొనసాగింపుగా ఊరికో ఉన్మాది 2వ సంపుటి టీడీపీ విడులచేయనుంది'' అపి అనిత ప్రకటించారు. 

''బుద్ధి జ్ఞానం లేనివాళ్లంతా జగన్ ను సింహంతో పోలుస్తున్నారు. ఆడబిడ్డ మానప్రాణాలు కాపాడలేని వాడు సింహమా?  ఆడవాళ్లను కాపాడలేని ముఖ్యమంత్రి కనీసం వారికి గన్ లైసెన్స్ అయినా ఇప్పిస్తే వారిని వారు కాపాడుకుంటారు. జగన్ రెడ్డి అండతో ఉన్మాదుల్లా పేట్రేగిపోతున్న ప్రతిఒక్కడికీ టీడీపీ ప్రభుత్వం రాగానే తాటతీయడం ఖాయం'' అని అనిత హెచ్చరించారు. 

ఇక ప్రతిభా భారతి మాట్లాడుతూ... ఉదయం ఒకరేప్, మధ్యాహ్నం మరో రేప్, సాయంత్రం ఇంకో రేప్ లా పరిస్థితి తయారయ్యిందన్నారు. ఇలా రేప్ ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారన్నారు. రాష్ట్రంలో కీచకులు, కిరాతకులు అధికమయ్యారు... వారికి భయమనేది లేదన్నారు. మహిళలను వేధించే ప్రభుత్వమిదని... పోలీసుల లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు మహిళా అఘాయిత్య కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

''అధికార పార్టీ అండదండలతోనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దారుణాలతో తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతున్నారు. ఆడబిడ్డల మానప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ వదలడు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్రానికి మహిళా హోంమంత్రి వున్నా ఆమెకు పరిపాలనలో అనుభవ రాహిత్యముంది.  జగన్మోహన్ రెడ్డి పాలనలో రాక్షస రాజ్యం నడుస్తోంది. గతంలో మహిళా సాధికారత అనే నినాదంతో నారా చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు'' అని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేర్కొన్నారు. 

 
 

click me!