రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు: కోనసీమలో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన జగన్

By narsimha lodeFirst Published May 13, 2022, 1:47 PM IST
Highlights

మత్స్యకార భరోసా పథకం కింది నిధులను ఏపీ సీఎం వైఎస జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఇవాళ  పోలవరం మండలం మురమల్లలో నిర్వహించిన  సభలో జగన్ ఈ నిధులను విడుదల చేశారు.
 

పోలవరం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే  పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మత్స్యకారులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Polavaram మండలం  Muramallaలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఏపీ సీఎం YS Jagan శుక్రవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా () కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేశామన్నారు.

దీంతో పాటు ONGC  పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేసినట్టుగా జగన్ గుర్తు చేశారు.

గతంలో 14,824 బాధిత Fisher Men  కుటుంబాలకు ఈ భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు అందించిన విషయానని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న  ఐదేళ్ల హయాంలో  కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే మత్స్యకారులకు సహాయం చేశారని జగన్ విమర్శించారు.

తమ ప్రభుత్వం వచ్చాక డీజిల్‌పై సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచినట్టుగా చెప్పారు. స్మార్ట్‌ కార్డులు జారీ చేసి డీజిల్‌ కొనే సమయంలోనే సబ్సిడీ సొమ్ము మినహాయింపునిస్తున్నామన్నారు.  సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా జగన్ చెప్పారు.  రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్‌ వివరించారు.

also read:ఆ భయంతోనే కుప్పంలో ఇల్లు: కోనసీమ జిల్లాలో చంద్రబాబుపై జగన్ సెటైర్లు

మత్స్యకారుల కష్టాలను  తన పాదయాత్రలో దగ్గరగా చూశానని  జగన్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ఆరోపించారు.. గత ప్రభుత్వ పాలనకు.. తన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని జగన్ ప్రజలను కోరారు. గతంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందేదని చెప్పారు.. 

తమ ప్రభుత్వం  అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తుందని  సీఎం జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50వేల మందికి పరిహారం ఇచ్చారన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు. ఇవాళ మన ప్రభుత్వంలో ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు.

చేపల వేట కోల్పోయిన 23,548 మంది మత్స్యకారులకు ఓఎన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నట్టుగా సీఎం వివరించారు. 

జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకార కుటుంబాలకు రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓఎన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు.

అంతకుముందు పశుసంవర్థక, మత్స్య శాఖమంత్రి సీదిరి Appala Raju మాట్లాడారు.. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు  భరోసా అందిస్తున్నట్టు చెప్పారు.. తమిళనాడులో ఐదు వేలు, ఒడిశాలో కేవలం 4 వేలు ఇస్తున్నారు. తీరప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో మత్స్యకారులకు పరిహారం అందిస్తున్నట్టుగా మంత్రి అప్పలరాజు  చెప్పారు.

కోనసీమను జిల్లాగా చూడాలన్న జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ Satish Kumar కృతజ్ఞతలు తెలిపారు. చేపల వేట నిషేదిత సమయంలో మనం అందిస్తున్న భరోసాను చూసి సీఎం జగన్‌ను మత్స్యకారులు వారింట్లో వ్యక్తిగా చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను అసలు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్‌ సహకారంతో ఓఎన్‌జీసీ నష్టపరిహారం అందుతోందన్నారు.

చేతి వృత్తులవారు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే కారణం​ సీఎం జగన్‌ అని అన్నారు. రాజకీయంగా పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినందుకు బీసీల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

click me!