ఏలూరులో దారుణం: డబ్బులివ్వలేదని దాడి, పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

By narsimha lode  |  First Published May 19, 2022, 2:58 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అప్పు తీసుకున్న డబ్బులు చెల్లించలేదని ఓ వ్యక్తిపై ఇష్టారీతిలో దాడికి దిగారు.ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఏలూరు: West Godavari  జిల్లాలో తీసుకున్న అప్పు డబ్బులు చెల్లించలేదని ఓ వ్యక్తిపై ఇష్టారీతితో దాడికి దిగారు. ఈ  దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Eluru లోని మార్కెట్ వద్ద Gopi  అనే వ్యక్తి Fruits వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన వ్యాపారం కోసం అవసరం ఉండి రూ. 30 వేలను తనకు తెలిసిన వ్యక్తి Vamsi  దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులకు ప్రతి నెల రూ. 3 వేలను చెల్లిస్తున్నాడు. అయితే గత ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో గత నాలుగు నెలల నుండి గోపి ఈ డబ్బులు వంశీకి చెల్లించలేదు.  దీంతో ఈ నెల 15న తన వద్దకు వచ్చిన వంశీ ఇష్టారీతిలో దూషించాడని గోపి చెప్పాడు. ఈ విషయమై తమ మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. 

Latest Videos

undefined

అయితే స్థానిక పెద్దలు ఇద్దరికి సర్ధి చెప్పారు. వంశీకి  డబ్బులు చెల్లించాలని కూడా గోపికి చెప్పారు. ఇందుకు గోపి కూడా సరేనని ఒప్పుకున్నాడు. అయితే అదే రోజున మధ్యాహ్నం మద్యం తాగిన వంశీ మరికొందరు వచ్చి తనపై దాడికి దిగారని గోపి చెప్పారు.వికెట్ తో పాటు తనపై దాడి చేశారన్నారు.

 ఈ దాడిని స్థానికులు నిలువరించకపోతే తాను బతికేవాడిని కాదన్నారు.ఈ విషయమై బాధితుడు గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ పిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15న గొడవ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

click me!