ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉంది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి. పయ్యావుల కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ విజయంపై ధీమాగా ఉన్నారు. కానీ, చివరకు పయ్యావులనే విజయం వరించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ప్రత్యేక పరిస్ధితులకు వేదిక. భూస్వాములకు ఈ నియోజకవర్గం కేంద్రం. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా ఇక్కడ భూస్వాముల పెత్తనం కొనసాగుతూనే వుంది. ఉరవకొండలో భూస్వాముల ఆగడాలపై కమ్యూనిస్టులు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. పెత్తందారుల ఆధీనంలో వున్న భూములను వెంటనే పేదలకు పంచాలని సీపీఐ నేత రాకెట్ల నారాయణ రెడ్డి ఉద్యమాలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన నాటి సీఎం ఎన్టీఆర్ స్వయంగా కౌకుంట్ల గ్రామానికి వచ్చి భూ సమారాధన పేరుతో పేదలకు భూములను పంచి ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే రాకెట్ల నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు రవీంద్రా రెడ్డిని ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు.
ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024.. టీడీపీకి కంచుకోట :
వ్యవసాయంతో పాటు చేనేత రంగంపై ఉరవకొండలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో నేతన్నలు ఉపాధి లేక వలసపోతున్నారు. గతంలో 15 వేలకు పైగా మగ్గాలు వున్న ఉరవకొండలో ప్రస్తుతం 5 వేలకు మించి మగ్గాలు లేవంటే పరిస్ధిత అర్ధం చేసుకోవచ్చు. 1962లో ఏర్పడిన ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెలుగుప్ప, కూడేరు మండలాలున్నాయి.
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,741 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఉరవకొండ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ ఆరుసార్లు, స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్‌కు 90,209 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి వై విశ్వేశ్వర్ రెడ్డికి 88,077 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీడీపీ 2,132 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఉరవకొండ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. ఐదోసారి విజయంపై పయ్యావుల కన్ను :
2024 ఎన్నికల విషయానికి వస్తే.. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవాలని పయ్యావుల కేశవ్ భావిస్తున్నారు. ప్రస్తుతం విపక్షంలో వుంటూ పీఏసీ ఛైర్మన్‌గా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో వుంటారన్న పేరుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను మరోసారి విజయం సాధిస్తానని పయ్యావుల ధీమాగా వున్నారు. వైసీపీ విషయానికి వస్తే.. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని జగన్ ధీమాగా వున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు.
ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉంది. కానీ, పయ్యావుల కేశవ్ ను విజయం సాధించారు.
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,741 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఉరవకొండ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ ఆరుసార్లు, స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్‌కు 90,209 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి వై విశ్వేశ్వర్ రెడ్డికి 88,077 ఓట్లు పోలయ్యాయి. 2,132 ఓట్ల తేడాతో పయ్యావుల విజయం సాధించారు. మరోసారి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై పయ్యావుల విజయం సాధించారు.