
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు అంశాలపై కేంద్ర ఆర్తిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకే విశాఖ ఉక్కు కర్మాగారాగన్ని ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ రంగంలోని ప్రతీ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను మాత్మరే నీతి ఆయోగ్ సూచనల మేరకు ప్రైవేటీకరిస్తామని ఆయన చెప్పారు.
ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో ఏపీ ఆర్థిక మంత్రి పోలవరం నిధులపై మూడు సార్లు తనను కలిసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గానీ అన్యాయం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్ ను జాతీయ దృక్పథంతో చూడాలని ఆయన సూచించారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర నిర్ణయంపై ఏపీలో పెద్ద యెత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా వామపక్షాలు నిలుస్తున్నాయి.