టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామా: స్పీకర్ కు లేఖ

By Siva KodatiFirst Published Feb 6, 2021, 2:15 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం అమల్లోకి వచ్చిన వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని గంటా కోరారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ పంపారు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని గంటా తెలిపారు.

Also Read:జాగ్రత్త... రైతు ఉద్యమం కంటే 100 రేట్ల పెద్ద ఉద్యమం..: కేంద్రానికి గంటా హెచ్చరిక

స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తానని గంటా వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలు రాజీనామా చేయాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనుండి మరీముఖ్యంగా విశాఖ ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖప్రజలు ఉద్యమానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికన కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

 

click me!