తెలంగాణ, ఏపీలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్స్

Published : Aug 12, 2023, 12:54 PM IST
తెలంగాణ, ఏపీలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్  మెడల్స్

సారాంశం

Police Medals: దేశవ్యాప్తంగా వివిధ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ సాధించిన వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 140 మంది పోలీస్ సిబ్బందిలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.  

MEDAL FOR EXCELLENCE IN INVESTIGATION: దేశవ్యాప్తంగా వివిధ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ సాధించిన వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 140 మంది పోలీస్ సిబ్బందిలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.

వివ‌రాల్లోకెళ్తే.. వివిధ కేసుల పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 140 మంది పోలీసుల‌కు కేంద్ర హోంమంత్రత్వ శాఖ మెడ‌ల్స్ ను ప్ర‌క‌టించింది. అధికారిక ప్రకటన ప్రకారం అవార్డు గ్రహీతలలో 22 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌ల నుంచి 10 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్  మెడల్స్ కు ఎంపిక‌య్యారు. వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి..

1. అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్
2. మన్సురుద్దీన్ షేక్, సర్కిల్ ఇన్స్పెక్టర్
3. ధనుంజయుడు మల్లెల, Dy.SP
4. సుప్రజ కొర్లకుంట, అడిషనల్‌ ఎస్పీ
5. రవిచంద్ర ఉప్పుటూరి, డీఎస్పీ

తెలంగాణ నుంచి.. 

1. మేకల తిరుపతన్న, అడిషనల్‌ ఎస్పీ
2. రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ
3. మూల జితేందర్‌ రెడ్డి, ఏసీపీ
4. కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్‌కుమార్‌, డీఎస్పీ
5. భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ

కాగా, నేరాల దర్యాప్తులో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, ఇన్వెస్టిగేషన్ లో ఎక్సలెన్స్ ను గుర్తించడం లక్ష్యంగా 2018లో ఈ మెడల్ ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ ఏడాదిలో ఈ అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐఏ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 09 మంది చొప్పున, తమిళనాడు నుంచి 08 మంది, మధ్యప్రదేశ్ నుంచి 07 మంది, గుజరాత్ నుంచి 06 మంది, ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ సంస్థల నుంచి ఎంపికయ్యారు. వీరిలో 22 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu