స్టీల్ ప్లాంట్ రగడ... పెట్టబడుల ఉపసంహరణ తప్పదు: నిర్మల కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Mar 8, 2021, 5:22 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని తెలిపింది. స్టీల్ ప్లాంట్‌లో వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని స్పష్టం చేసింది

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని తెలిపింది. స్టీల్ ప్లాంట్‌లో వందశాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని స్పష్టం చేసింది.

మెరుగైనప ఉత్పాదకత కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిర్మల సమాధానం తెలిపారు. ప్రైవేటీకరణతో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

కాగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నాయి. అటు ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. 


 

click me!