రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం ద్వారా ప్రజలకు మేలు కలుగుతోందని పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం ద్వారా ప్రజలకు మేలు కలుగుతోందని పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
సోమవారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.స్వంత వాహనాల్లో కూడ ఇసుకను తీసుకెళ్లవచ్చన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ను ఏర్పాటు చేశామన్నారు. నిర్ణీత రేటు కన్నా ఎక్కువ ధరకు ఇసుకను విక్రియించవద్దని ఆయన కోరారు.
ఆన్‌లైన్ లో కాకుండా నేరుగా వెళ్లి ఇసుకను కొనుగోలు చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రల ఇబ్బందులను అధ్యయనం చేసి కొత్త విధానం రూపొందించినట్టుగా ఆయన చెప్పారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద నిర్ణీత ధర ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇసుక రీచ్ వద్ద ఒకే ధర ఉంటుందని ఆయన వివరించారు.
ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు కూడ ఉంటాయని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్ ఎంపిక కోసం పారదర్శక విధానాలను అవలంభిస్తున్నామన్నారు.ఇసుక తవ్వకం, నిల్వ, పంపిణీల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామని ఆయన వివరించారు.
ఇసుక డోర్ డెలీవరీ విధానం లేదన్నారు. ఇసుక రీచుల ద్వారా రూ 950 కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో రాష్ట్రానికి రూ,. 760 కోట్లు ఇస్తున్నట్టుగా చెప్పారు. రూ. 2 వేల కోట్ల ఆదాయం ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు.ఆరోపణలు చేసేవారు ఓపెన్ టెండర్లలో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు.