ఉండవల్లి: జగన్ కు షాక్, చంద్రబాబుకు చేయూత

Published : Jul 16, 2018, 09:44 PM IST
ఉండవల్లి: జగన్ కు షాక్, చంద్రబాబుకు చేయూత

సారాంశం

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు. 

అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు. వైసిపి ఎంపీలు రాజీనామా చేయడం సరి కాదని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి చంద్రబాబును కలవడం ఆసక్తిని రేపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడం వల్లనే వచ్చినట్లు చెప్పిన ఆయన చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై తాను చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు తెలిపారు. తాను రాసిన లేఖలపై చంద్రబాబుతో చర్చించినట్లు ఆయన చెప్పారు. 

2014 ఫిబ్రవరి 18వ తేదీన చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. సభలో జరిగిన విషయాలపై కోర్టుకు కల్పించుకోదని, అయితే తాము చట్టవిరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనపై కోర్టుకు వెళ్లామని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?