మైనర్ బాలికపై కన్నేసిన బాబాయి

Published : Jul 15, 2020, 12:21 PM ISTUpdated : Jul 15, 2020, 12:34 PM IST
మైనర్ బాలికపై కన్నేసిన బాబాయి

సారాంశం

మాయ మాటలతో  బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది.

కన్న తండ్రితో సమానమైన బాబాయి.. మైనర్ బాలికపై కన్నేశాడు. బాలికను వెంబడించి.. మాయ మాటలతో  బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆత్మకూరు మండలం బసవరాజుపాళెం గ్రామానికి చెందిన ఓ మైనర్‌(12) మూడు రోజుల క్రితం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లింది. ఆ బాలికకు బాబాయి వరసయ్యే యువకుడు తిరుపతయ్య(ఉరఫ్‌ సురేష్‌) ఆ బాలికను వెంబడించి పొలంలో మాయమాటలు చెప్పాడు. 

సెల్‌ఫోన్లో నీలిచిత్రాలు చూపించి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు